Media Coverage

వృద్ధాప్యం వచ్చాక కాదు... ముందే ప్లాన్ చేసుకుంటున్న సీనియర్లు! భారత్‌లో మారుతున్న లైఫ్‌స్టైల్ ఇదే

Senior couple enjoying tea together on their balcony overlooking the city skyline at sunset

వృద్ధాప్యం వచ్చాక కాదు... ముందే ప్లాన్ చేసుకుంటున్న సీనియర్లు! భారత్‌లో మారుతున్న లైఫ్‌స్టైల్ ఇదే

భారత్‌లో సీనియర్ లివింగ్ రంగం వేగంగా మారుతోంది. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో హెల్త్కేర్, వెల్‌నెస్, రిటైర్‌మెంట్ ప్లానింగ్, ఆర్థిక భద్రతకు ప్రాధాన్యం పెరుగుతోంది. 2050 నాటికి 60 ఏళ్ళు దాటిన వారి సంఖ్య 34.7 కోట్లకు చేరుతుందని అంచనా.

భారత్‌లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఉండే సీనియర్ లివింగ్ రంగం ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ఇంతకాలం ఇళ్ళ నిర్మాణం, అమ్మకాల చుట్టూనే ఉండి ఈ రంగం ఇప్పుడు హౌసింగ్, హెల్త్కేర్, వెల్‌నెస్, హాస్పిటాలిటీ, కమ్యూనిటీ వంటి సేవలను కలిపిన పెద్ద వ్యవస్థగా మారుతోంది. దేశంలో 60 ఏళ్ళు దాటిన వారి సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో ఈ రంగానికి ఉన్న అవకాశాలు దీర్ఘకాలికంగా కనిపిస్తున్నాయి. కొలియర్స్ ఇండియా విడుదల చేసిన 'ది ఫ్యూచర్ ఆఫ్ ఏజింగ్ అండ్ లాంగెవిటీ ఎకానమీ ఇన్ ఇండియా, 2026' నివేదిక ప్రకారం, 2022లో భారత్‌లో 60 ఏళ్ళు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య దాదాపు 14.9 కోట్లు. ఇది దేశ మొత్తం జనాభాలో 10.5 శాతం. 2050 నాటికి ఈ సంఖ్య 34.7 కోట్లకు, అంటే దేశ జనాభాలో 20.8 శాతానికి చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో భారత్‌లో సీనియర్ లివింగ్ మార్కెట్ దాదాపు 12 బిలియన్ డాలర్ల అవకాశంగా కనిపిస్తోంది. అయితే ఈ రంగం ఎదగాలంటే వృద్ధుల కోసం ఇళ్ళు కట్టడం ఒక్కటే సరిపోదు. వృద్ధులు వయసు పెరిగినా స్వతంత్రంగా, చురుకుగా, గౌరవంగా జీవించేలు ప్రొఫెషనల్‌గా నిర్వహించే వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కీలకంగా మారుతోంది.

బిల్డ్ అండ్ సెల్ నుంచి ఆపరేటింగ్ బిజినెస్ వైపు

సీనియర్ లివింగ్ రంగంలో వస్తున్న ప్రధాన మార్పుల్లో ఒకటి సంప్రదాయ బిల్డ్ అండ్ సెల్ రియల్ ఎస్టేట్ మోడల్ నుంచి బయటకు రావడం. సీనియర్ లివింగ్‌ను కేవలం నిర్మించి అమ్మే వ్యాపారంగా చూలేం. ఇళ్లలో ఎంతమంది ఉంటున్నారు, సేవల నాణ్యత, నివాసుల అనుభవం, సంస్థపై నమ్మకం వంటి అంశాలు కూడా వ్యాపార విలువను నిర్ణయిస్తాయి. భవనం, భౌతిక సదుపాయాలతో పాటు హెల్త్కేర్, వెల్‌నెస్, హాస్పిటాలిటీ, కమ్యూనిటీ కార్యక్రమాలు, నివాసులకు అందించే సేవలు కూడా కీలకంగా మారుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు భూమి, భవనం విలువతో పాటు సంస్థకు ఈ రంగాన్ని నిర్వహించే సామర్థ్యం ఉందా అన్నదీ చూడాల్సి ఉంటుంది.


Media Coverage

Published In: News18 Telugu

Author: Santhosh Kumar S

Publication Date: 24 September 2026

Original Article Title:
వృద్ధాప్యం వచ్చాక కాదు... ముందే ప్లాన్ చేసుకుంటున్న సీనియర్లు! భారత్‌లో మారుతున్న లైఫ్‌స్టైల్ ఇదే

Coverage Type: News Article

Read the Original Article:
Read the full article on News18 Telugu

Share this
Back to Media