Media Coverage

V6 Velugu

V6 Velugu coverage of Amaya senior living community in Hyderabad

సీనియర్ సిటిజన్ల కోసం అమయ్.. వెరా విటా నుంచి కమ్యూనిటీ లివింగ్ ప్రాజెక్టు

హైదరాబాద్, వెలుగు: వృద్ధుల కోసం వెరా విటా లివింగ్ హైదరాబాద్‌లో ప్రీమియం సీనియర్ లివింగ్ కమ్యూనిటీ అమయ్‌ను ప్రారంభించింది. మూడు దశల్లో దీనిని నిర్మించడానికి రూ.600 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని తెలిపింది. రాబోయే ఐదేళ్లలో మరిన్ని నగరాలలో ఇలాంటి ప్రాజెక్ట్‌లను అభివృద్ధి చేస్తామని వెల్లడించింది.

హైదరాబాద్‌లోని కండ్లకోయ రిజర్వ్ ఫారెస్ట్ దగ్గర ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తారు. ఇక్కడ నివసించే వారికి వైద్య సేవలు, వినోదం, భోజన వసతి వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

మొదటి దశలో మూడు ఎకరాల విస్తీర్ణంలో 256 ఫ్లాట్లను నిర్మిస్తారు. వీటిలో 1, 2, 2.5, 3, 3.5 బెడ్‌రూమ్ కాన్ఫిగరేషన్లు ఉంటాయి.

విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, కూనూర్, పుణె నగరాలలో కూడా తమ సేవలను విస్తరించాలని సంస్థ భావిస్తోంది.


Media Coverage

Published In: V6 Velugu

Coverage Type: News Article

Publication Date: 28 August 2026

Original Article Title:
సీనియర్ సిటిజన్ల కోసం అమయ్.. వెరా విటా నుంచి కమ్యూనిటీ లివింగ్ ప్రాజెక్టు

Original Article:
Read the full article on V6 Velugu

Share this
Back to Media